మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తెరాస తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పల్లె రవికుమార్ గౌడ్ దంపతులను కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్.. మళ్లీ తెరాస పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం తెరాసలో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని తెలిపారు. కేటీఆర్ సమక్షంలో ఎలాంటి షరతుల్లేకుండా పార్టీలో చేరామని పల్లె రవికుమార్ తెలిపారు.