నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలోని భూముల్లో వర్షాల కారణంగా నేలకొరిగిన పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. చేతికందే దశలో విపరీతంగా కురిసిన వర్షాలకు పాడైపోయిన వరి పైర్లను బృందం సభ్యులు పరిశీలించారు.
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం - నల్గొండ జిల్లా తాజా వార్తలు
భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో నేలకొరిగిన పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. చేతికందే దశలో విపరీతంగా కురిసిన వర్షాలకు పాడైపోయిన వరి పైర్లను బృందం సభ్యులు పరిశీలించారు.

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం
లోతట్టు ప్రాంతం కాబట్టి నీరు నిలిచే అవకాశం ఉంది కదా అని అటు రైతుల్ని, ఇటు అధికారులను వారు ప్రశ్నించారు. వర్షాధారంతో పంటలు పండిస్తామని కానీ ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వానల వల్లే పెద్ద ఎత్తున నీరు నిలిచిందని రైతులు చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదని వివరించారు.
ఇదీ చదవండి:నిద్ర మాత్రలు ఇచ్చి.. గొంతునులిమి దీక్షిత్ హత్య..