CEC directives to the State Election Commission: మునుగోడు ఉపఎన్నికలో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఉంచాలని, అభ్యర్థుల వ్యయంపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెరాస ఫిర్యాదు నేపథ్యంలో భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన వివరణను ఈసీ పరిశీలించింది. దాని ఆధారంగా సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు సంబంధించి తెరాస ఎలాంటి ఆధారాలు చూపలేదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
'ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దు.. అభ్యర్థుల వ్యయంపై నిఘా ఉంచండి' - రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సీఈసీ కీలక ఆదేశాలు
CEC directives to the State Election Commission: రాష్ట్రంలో తుదిదశకు చేరిన మునుగోడు ఉపఎన్నికలో నేతల ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఉంచాలని అభ్యర్థుల వ్యయంపై పర్యవేక్షణ కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతే కాకుండా తెరాస నాయకులు రాజగోపాల్‌రెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని అభిప్రాయపడింది.
Central Election Commission
ఇదే సమయంలో ఆరోపణలన్నింటినీ సదరు అభ్యర్థి తోసిపుచ్చినట్లు పేర్కొంది. వీటన్నింటి నేపథ్యంలో నియోజకవర్గంలో వివిధ సంస్థల ద్వారా పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించింది. ఎప్పటికప్పుడు వచ్చే అదనపు సమాచారం ఆధారంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై కూడా పూర్తి పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: