నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా డ్యాంపై సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ప్రారంభించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో 30 కెమెరాలను అమర్చనున్నట్టు డ్యాం అధికారులు తెలిపారు.
సాగర్ డ్యాంపై పటిష్ఠ నిఘా.. 30 సీసీ కెమెరాల ఏర్పాటు - నాగార్జునసాగర్ డ్యాంపై సీసీ కెమెరాల ఏర్పాటు
నాగార్జునసాగర్ జలాశయం వద్ద భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యామ్ నుంచి ప్రధాన జలాశయం వరకు సీసీ కెమెరాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవే కాక పటిష్ఠ నిఘా కోసం మరికొన్ని టెక్నికల్ పనులను చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.
సాగర్ డ్యాంపై పటిష్ఠ నిఘా.. 30 సీసీ కెమెరాల ఏర్పాటు
ఇదే కాకా పోలీసు సిబ్బందికి వాకిటాకీలు, మెటల్ డిటెక్టర్స్, మానిటరింగ్ రూమ్ల ఏర్పాటు కోసం మరొక రూ.90 లక్షలతో పనులను వేగవంతం చేయనున్నట్టు సమాచారం. సాగర్ జలాశయం వద్ద మరింత పటిష్ఠ నిఘా విభాగం ఏర్పాటు దిశగా టెక్నికల్ పనులను చేపట్టనున్నారు.
- ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..