Car Fell Down in Sagar Canal: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాలువలో హోండా సిటీ కారు కొట్టుకు వచ్చింది. ఎడమ కాలువలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో పడవ మాదిరిగా కారు నీటిలో వెళ్తోంది. ఇద్దరు వ్యక్తులు కారును కాలువ కట్ట మీద నుంచి నీటిలోకి తోసివేసినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు.
సాగర్ కాల్వలో కొట్టుకుపోతున్న కారు - సాగర్ కాల్వలో పడ్డ కారు
Car Fell Down in Sagar Canal: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో కారు కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు కారును కాల్వలోకి తోసి వెళ్లినట్లుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
car
నీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్న కారు కనపడటంతో వేములపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కారులో ఎవరు లేరని తెలిపారు. కారుని నీటిలో తోయడానికి గల కారణాలు ఏంటి? ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి :స్నానానికి వెళ్లి.. చెరువులో ముగ్గురు గల్లంతు