నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. మెరుగైన చికిత్స నిమిత్తం క్షతగాత్రులను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గురువారం ఓటేసి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
నాగార్జునసాగర్ వద్ద కారు బోల్తా... వ్యక్తి మృతి - కారు ప్రమాదం
ఓటేయడానికి సొంతూరికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు నాగార్జున సాగర్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గాయాలపాలైన ఐదుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
కారు ప్రమాదం