నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పదకొండవ రోజూ కొనసాగుతోంది. ఉదయం నుంచే కార్మికులు బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రానీయకుండా సమ్మె చేస్తున్నారు. వీరికి మద్దతుగా తెదేపా, తెజస, సీపీఎం, ఐటీఎఫ్ పార్టీలు, సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. కేవలం డిపోలోని బస్సులను బయటకు రానీయకుండా చేయడమే కాకుండా బయట నుంచి వస్తున్న బస్సులను కూడా ప్రయాణ ప్రాంగణంలోకి అనుమతించట్లేరు. పనుల నిమిత్తం వేరే ప్రాంతాల వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నల్గొండ జిల్లాలో బయటకు రాని బస్సులు - TSRTC
నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 11వ రోజు ఉద్ధృతంగా కొనసాగుతోంది. బస్సులను బయటకు రానీయకుండా డిపో ఎదుటే బైఠాయించి ధర్నాకి దిగారు ఆర్టీసీ కార్మికులు.
నల్గొండ జిల్లాలో బయటకు రాని బస్సులు