నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కనే శ్మశాన వాటిక ఉంది. ఎవరైనా చనిపోయి, శ్మశానవాటికకు తీసుకొస్తే ఆ రోజు పాఠాలు చెట్లకిందనే. తరగతి గది కిటికీ తీస్తే... ఆ దృశ్యాలే కనిపిస్తాయి. ఏడుపులు, డప్పు చప్పుళ్లకు పిల్లలు వణికిపోతున్నారు. నిద్రలోనూ కలవరిస్తున్నారు. శవాన్ని దహనం చేస్తున్నప్పుడు వచ్చే పొగతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అస్వస్థతకు గురవుతున్నారు.
ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే - smashanam
శ్మశానవాటిక అంటే ఊరి చివర్లో ఉండాలి. జనావాసాల మధ్య ఉంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కానీ బడి పక్కనే ఉంటే పిల్లలకు నిజంగా పరీక్షే. ఊర్లో ఎవరైనా చనిపోతే.. ఆ విద్యార్థులు భయంతో వణికిపోతారు.
ఆ ఊర్లో బడి.. బస్టాండు... శ్మశానం పక్కపక్కనే
శ్మశానానికి పక్కనే బస్టాండు కూడా ఉంది. అక్కడికి వచ్చే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఆ రోజంతా బయటకు రాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి తరలించాలని శాసనసభ్యునికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోయారు. పైగా శ్మశానంలో వసతులు కల్పిస్తూ... అభివృద్ధి చేస్తున్నారని విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: గాడిదల పెళ్లికి ఊరి పెద్దల హడావుడి!