నందికొండ వరకు లాంచీలో ఆయన ప్రయాణం చేశారు. సాగర్, శ్రీశైలం లాంచీ ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీలైతే మరొకసారి పర్యాటక శాఖ మంత్రి పరిశీలిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
'సాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం దేశంలోనే ప్రత్యేకమైనది' - నల్గొండ జిల్లా తాజా వార్తలు
దేశంలో ఎక్కడాలేని విధంగా చేపడుతోన్న బుద్ధవనం పనులను పర్యటక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజు పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. బుద్ధవనాన్ని త్వరలోనే రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు.
!['సాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం దేశంలోనే ప్రత్యేకమైనది' buddhavanam review by principal secretary in nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9541703-203-9541703-1605335156519.jpg)
ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న బుద్ధవనం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మిస్తున్న బుద్ధవనం దేశంలోనే ప్రత్యేకమైనదని పర్యటక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజు తెలిపారు. బుద్ధ వనాన్ని ఆయన పరిశీలించారు. అన్ని హంగులతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు. బుద్ధవనంలో బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన మ్యూజియాన్ని తిలకించారు. ఆడిటోరియంలో ఉన్న వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధుని పాదాల వద్ద అందరూ కలిసి మొక్కలు నాటారు.