నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి బోనాల మహోత్సవం వైభవంగా సాగింది. కరోనా నేపథ్యంలో మూకుమ్మడిగా కాకుండా అందరూ కలిసి ఒకే బోనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. కంఠమహేశ్వరస్వామికి జలాభిషేకం చేశారు.ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
నేరడలో వైభవంగా కంఠమహేశ్వర స్వామి బోనాలు - bonalu festival in nalgonda district
నల్గొండ జిల్లా నేరడ గ్రామంలో కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలందరూ మూకుమ్మడిగా ఒకే బోనం సమర్పించారు.

నేరడలో వైభవంగా కంఠమహేశ్వర స్వామి బోనాలు