తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగార్జునసాగర్​లో లాంచీ ట్రిప్పులు ప్రారంభం - nagarjun sagar update

కరోనా వల్ల మార్చి నుంచి నాగార్జున సాగర్​లో నిలిపేసిన లాంచీ ట్రిప్పులను ప్రారంభించారు. 120 మంది సామర్థ్యం గల లాంచీలో కేవలం 60 మందిని మాత్రమే అనుమతిస్తూ... జాలీ ట్రిప్పులను నడుపుతున్నారు.

boat tour starting from today in nagarjunsagar
boat tour starting from today in nagarjunsagar

By

Published : Oct 2, 2020, 1:57 PM IST

నాగార్జునసాగర్ జలాశయంలో నేటి నుంచి పర్యాటకుల కోసం లాంచీలను నడిపేందుకు పర్యాటక శాఖ అనుమతులిచ్చినట్లు లాంచీ మేనేజర్ హరి తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి లాంచీ ప్రయాణాన్ని నిలిపి వేశారు. నేటి నుంచి 120 మంది సామర్థ్యం ఉన్న లాంచీని కేవలం జాలీ ట్రిప్పులను మాత్రమే నడుపుతున్నారు.

జాలీ ట్రిప్పులకు వెళ్లే పర్యాటకులకు టిక్కెట్ ధరలు పెద్దలు అయితే రూ.100, పిల్లలకు అయితే రూ.70 గా నిర్ణయించారు. లాంచీ ప్రయాణంలో కరోనా వైరస్ ప్రబలకుండా శానిటైజరు చేస్తూ... సామాజిక దూరం పాటిస్తున్నారు. ప్రతి ట్రిప్పు కు 60 మంది పర్యాటకులను అనుమతిస్తున్నట్లు హరి తెలిపారు.

ఇదీ చూడండి:సాగర్​ 10 క్రస్ట్​ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details