తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్-జానారెడ్డికి మధ్య ఏదో చీకటి ఒప్పందం కుదిరింది' - Sagar by-election

ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి విజయ రామారావు అన్నారు. ప్రభుత్వ అసమర్థ పాలనే దీనికి కారణమని ఆరోపించారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా సాగర్ ఉపఎన్నికలో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సాగర్​ ప్రజలు తెరాసకు సరైన బుద్ధి చెపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sagar by-election
సాగర్​ ఉప ఎన్నికలు

By

Published : Apr 7, 2021, 4:43 PM IST

సీఎం కేసీఆర్​ అసమర్థ పాలన వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి విజయ రామారావు ఆరోపించారు. సునీల్ నాయక్, మహేందర్, రవిల మరణాలకు తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బీజేవైయం నాయకులతో కలసి నల్గొండ జిల్లా హాలియా ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.

నిరుద్యోగులకు భృతి ఇవ్వ కుండా సాగర్ ఉపఎన్నికలో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తాగిన మైకంలో హామీలిచ్చి... మర్చిపోయాడని విమర్శించారు. సీఎంగా దళితులకు అవకాశం ఇస్తానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు.

హాలియాలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మహిళను తిట్టి... మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సాగర్​ నియోజకవర్గ మహిళలను కేసీఆర్ కుక్కలని తిడుతుంటే మాజీ మంత్రి జానారెడ్డి ఏమీ స్పందించడం లేదంటే... సీఎంకు జానారెడ్డికి మధ్య ఏదో చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.

ఇదీ చదవండి:ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

ABOUT THE AUTHOR

...view details