భాజపాకు కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదని.. ప్రజలను కాపాడుకోవడమే పార్టీ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
ప్రజలను కాపాడుకోవడమే భాజపా ధ్యేయం: బండి సంజయ్ - telangana latest news
ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదన్నారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్‌షో అనంతరం ఆయన మాట్లాడారు.
bandi sanjay fires on cm kcr
సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్‌షో అనంతరం సంజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు తెరవలేకపోయారని బండి ప్రశ్నించారు. ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు.