తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay comments: ' రైతుల కోసం రాళ్ల దాడికైనా సిద్ధమే' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

పండిన ప్రతి గింజా కొంటానని సీఎం కేసీఆర్(cm kcr) గతంలో చెప్పారని... సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay comments) ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు.

bandi sanjay comments, bandi sanjay in nalgonda
బండి సంజయ్ నల్గొండ పర్యటన, బండి సంజయ్క కామెంట్స్

By

Published : Nov 15, 2021, 2:06 PM IST

Updated : Nov 15, 2021, 3:05 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) బాధ్యతను మరచి మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay comments) ఆరోపించారు. సీఎం కేసీఆర్ గజినీ వేషాలు మానుకోవాలని అన్నారు. పండిన ప్రతి గింజా కొంటానని సీఎం గతంలో చెప్పారని... సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు దసరా, దీపావళి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని... ధాన్యం మొలకలు వస్తోందని అన్నారు.

రాళ్ల దాడికి సిద్ధమే..

గతేడాది 1.41కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని సంజయ్(bandi sanjay latest news) వెల్లడించారు. వరి మద్దతు ధరను రూ.1,960కు పెంచామని తెలిపారు. 60లక్షల టన్నులు కొనాలని ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకొని... 7 లక్షల టన్నులే కొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. మిగతా పంట ఎప్పుడు కొంటారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస కార్యకర్తలు రైతుల్లాగా వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

బండి సంజయ్ కామెంట్స్

ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి రాష్ట్రముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రైతుల దృష్టి మళ్లించడానికి... భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భాజపా కాదు. దానికి భయపడే కార్యకర్తలు భాజపా కార్యకర్తలు కాదు. రాష్ట్రముఖ్యమంత్రి బయటకు రావాలి. బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాన్ని చూస్తే... మాకెందుకు ఈ ఇబ్బంది. ఏమన్నా అంటే కేంద్రం అంటారు. ఎఫ్​సీఐ, రాష్ట్రానికి జరిగిన ఒప్పందం ఏంటి? 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలి. మీరు కొన్నది ఎంత? 7 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు ప్రభుత్వమే చెప్తోంది. రైతుల కోసం రాళ్ల దాడికైనా సిద్ధమే.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఉద్రిక్తత

ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay nalgonda visit) పర్యటన ఉద్రిక్తతలు దారితీసింది. సంజయ్ పర్యటనను వ్యతిరేకిస్తూ... తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. తెరాస శ్రేణులనూ చెదరగొట్టారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని భాజపా శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో పరిస్థితి చేయిదాటకుండా ఐకేపీ కేంద్రం నుంచి పోలీసులు తెరాస కార్యకర్తలను పంపించారు.

ఎమ్మెల్యే కామెంట్స్

బండి సంజయ్(bandi sanjay latest news) రాకకు ముందే ఐకేపీ కేంద్రాన్ని తెరాస ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వర్షకాలం సీజన్​లో పండిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని..... యాసంగి ధాన్యం కొంటామని కేంద్రప్రభుత్వం హామీ ఇస్తుందా? అని బండి సంజయ్​కు సవాల్ విసిరారు. బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీగా బలగాలు మోహరించారు. ఇరు వర్గాలు ఒకేచోట పోగవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఐకేపీ సెంటర్‌లో బందోబస్తును పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:Bandi sanjay: బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత.. గో బ్యాక్ అంటూ నినాదాలు

Last Updated : Nov 15, 2021, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details