తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు టోకెన్లు ఇవ్వాలని భాజపా ఆందోళన - భాజపా ఆందోళన వార్తలు

నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు భాజపా ఆందోళనకు దిగింది. రైతులకు అధికారులు టోకెన్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ ధర్నా చేపట్టింది.

రైతులకు టోకెన్లు ఇవ్వాలని భాజపా ఆందోళన
రైతులకు టోకెన్లు ఇవ్వాలని భాజపా ఆందోళన

By

Published : Nov 12, 2020, 5:14 PM IST

రైతులకు ధాన్యం టోకెన్లు ఇవ్వాలంటూ... నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిషత్ కార్యాలయం ముందు భాజపా ఆందోళనకు దిగింది. రెండు రోజులుగా ధాన్యం టోకెన్లు ఇస్తున్నారని... ఈరోజు అధికారులు టోకెన్లు ఇవ్వలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర... రైతులు పండించిన ధాన్యానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతుల వెన్ను విరిచే విధంగా నియంత్రిత సాగు ఉందని మండిపడ్డారు. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్ధతు ధర కోసం పోరాటానికి భాజపా వెనకాడబోదని హెచ్చరించారు.

ఇదీ చూడండి:మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్‌ భేటీ

ABOUT THE AUTHOR

...view details