Etela Rajender on Palivela Issue: మునుగోడు నియోజకవర్గం పలివెలలో జరిగిన దాడి ఘటనపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేస్తుంటే.. తెరాస దాడులకు పాల్పడిందని ఆరోపించారు. తెరాస శ్రేణుల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయన్న ఈటల.. తన గన్‌మెన్లు, పీఏ, మరికొందరు గాయపడ్డారని తెలిపారు.
దాడిలో కొన్ని వాహనాలూ ధ్వంసమయ్యాయని ఈటల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దాడులు చేయడం భాజపా సంస్కృతి కాదన్న పేర్కొన్న రాజేందర్.. మునుగోడు ప్రజలు అంతా గమనిస్తున్నారని, తెరాస చెంప చెల్లుమనే తీర్పు ఇస్తారని వ్యాఖ్యానించారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే తెరాస నేతలు ఇలా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
తెరాస చెంపచెల్లుమనే తీర్పు మునుగోడులో వస్తుంది. మునుగోడు ప్రజలు అంతా గమనిస్తున్నారు. తెరాస శ్రేణుల దాడిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. నా గన్‌మెన్లు, పీఏ, మరికొందరు గాయపడ్డారు. కొన్ని కార్లు కూడా ధ్వంసమయ్యాయి. దాడులు చేయడం భాజపా సంస్కృతి కాదు. - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే