తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు టీచర్లను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం' - ప్రైవేటు టీచర్ల డిమాండ్​

ప్రైవేటు టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి ఆదుకోవాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి ఆపలేరని నల్గొండలోని మీడియా సమావేశంలో హెచ్చరించారు. పోలీసులు ప్రజల పక్షాన పని చేయాలని సూచించారు.

bjp press meet in nalgonda
'ప్రైవేటు టీచర్లను ఆదుకునే దాకా ఉద్యమిస్తాం'

By

Published : Oct 28, 2020, 2:57 PM IST

ప్రైవేటు టీచర్లను ఆదుకునే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్రమ కేసులతో తమను ఆపలేరని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. తెరాస ప్రభుత్వం పతనం ఆరంభమైందని విమర్శించారు. పోలీసులు నిజాయితీగా ప్రజల పక్షాన పనిచేయాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసులంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ పాలనను తలపిస్తోందని ఆరోపించారు.

రైతు బంధు ద్వారా ఒక చేతితో డబ్బులు ఇస్తూ...ఎల్ఆర్ఎస్ పథకంతో మరో చేతితో డబ్బులు లాగుతోందని ఆరోపించారు. తెరాస పతనం నల్గొండ జిల్లా నుంచే మొదలవుతుందని హెచ్చరించారు. ప్రవేటు టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:పూర్తిస్థాయి నీటిమట్టానికి నాగార్జునసాగర్ జలాశయం

ABOUT THE AUTHOR

...view details