కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని భాజపా నేతలు ఆరోపించారు. సన్నరకాలను వేసిన అన్నదాతలు మద్ధతు ధరరాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యానికి ధర రూ. 2500 ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఇకనైనా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవొద్దు: భాజపా
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట భాజపా నేతలు ధర్నా చేపట్టారు. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 2500 మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇకనైనా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవొద్దు: భాజపా
ఇకనైనా ప్రభుత్వం.. నియంత్రిత సాగే చెయ్యాలని రైతుల మీద ఒత్తిడి తేవొద్దని.. భూసారాన్ని బట్టి ఎలాంటి పంట వేస్తే లాభాలు వస్తాయో ఆవిధంగా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.