నల్గొండ జిల్లా మునుగోడు తహసీల్దారు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భాజపా శ్రేణులు జెండా ఎగురవేసేందుకు యత్నించారు.
తహసీల్దారు కార్యాలయంపై జెండా ఎగురవేసేందుకు యత్నించిన భాజపా - నల్గొండ జిల్లా భాజపా వార్తలు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తహసీల్దారు కార్యాలయంపై జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మనుగోడులో జరిగింది.
తహసీల్దారు కార్యాలయంపై జెండా ఎగురవేసేందుకు యత్నించిన భాజపా
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన నేతలు ఆ అంశాన్ని విస్మరించారని ఆరోపించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. 20 మంది భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:బెడిసికొట్టిన రిపోర్టర్ డీలింగ్... ట్రాప్లో పడి కిడ్నాప్