munugodu by election: కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉపఎన్నిక జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను భాజపా ప్రతినిధుల బృందం కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బుద్దభవన్లో వికాస్‌రాజ్‌ను కలిసిన వారు.. మునుగోడులో స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలని వినతి పత్రం ఇచ్చారు. మునుగోడులో డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెరాస గెలవాలని ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు.
భాజపాలో కొత్తగా చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. దీనిపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి నివేదించారు. గతంలో తెరాస నాయకులు డబ్బులను అంబులెన్స్, పోలీసు వాహనాల ద్వారా సరఫరా చేశారని.. ఆ వాహనాలను పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.