నాగార్జునసాగర్ భాజపా అసంతృప్త నేత కడారి అంజయ్య తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో అంజయ్య తన అనుచరులతో కలిసి తెరాస కండువా కప్పుకున్నారు.
తెరాసలో చేరిన భాజపా నేత అంజయ్య - Kadari Anjaiah news today
నాగార్జున సాగర్ భాజపా కీలక నేత కడారి అంజయ్య యాదవ్ తెరాసలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన తెరాస కండువా కప్పుకున్నారు. పలువురు కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో జాయిన్ అయ్యారు.
తెరాసలో చేరిన భాజపా నేత అంజయ్య
అంజయ్య నాగార్జునసాగర్ నుంచి భాజపా టికెట్ ఆశించి భంగపడ్డారు. కేసీఆర్ కండువా కప్పి అంజయ్యను పార్టీలోకి ఆహ్వానించారు. నాగార్జునసాగర్‌లో తెరాసకు సానుకూల వాతావరణం ఉందని.. నూటికి నూరు శాతం గెలుస్తుందని నేతలతో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :చివరిరోజే నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు