నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటు సాగర్ ఉప ఎన్నికల వేడి మొదలు అయింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో భాజపా పోలింగ్ బూత్‌ల సమ్మేళన సభ నిర్వహించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిచేలా బూత్ కార్యకర్తలు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి అన్నారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయానికి కృషి చేయండి' - BJP held a meeting of polling booths at Tripuraram
నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో భాజపా పోలింగ్ బూత్‌ల సమ్మేళన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
!['ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా విజయానికి కృషి చేయండి' BJP held a meeting of polling booths at Tripuraram constituency in Nalgonda district.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10890865-894-10890865-1614996607368.jpg)
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా గెలుపుకు కృషి చేయండి'
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులను, నిరుద్యోగులను, ఉద్యోగులను పట్టించుకోట్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.. అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి భాజపా సాగర్ ఎన్నికల సమన్వయ కర్తలు సంకినేని వెంకటేశ్వరరావు, చాడా సురేష్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్