నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. రవికుమార్ వెంట గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. జనరల్ స్థానంలోనూ... ఒక ఎస్టీకి టికెట్ ఇచ్చి భాజపా మార్పునకు శ్రీకారం చుట్టిందని రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎస్టీల ఓట్లు దండుకున్నారే తప్పా... ఒక్క పార్టీ కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈసారి నాగర్జునసాగర్లో వంద శాతం భాజపా జెండానే ఎగురుతుందని పేర్కొన్నారు.
నామపత్రాలు దాఖలు చేసిన భాజపా అభ్యర్థి రవికుమార్ - nagarjuna sagar by election nomination
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు ప్రధానపార్టీలు, స్వతంత్రులతో కలిసి సుమారు 30 మంది నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజున తెరాస, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేయగా... భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్ నామపత్రాలు దాఖలు చేశారు.
bjp candidate ravikumar nomination for nagarjuna sagar by election
ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు చాలా మంది టికెట్ ఆశించినా... డాక్టర్ పనుగోతు రవికుమార్‌వైపే భాజపా మొగ్గు చూపింది. తమ అభ్యర్థిగా రవికుమార్‌ను నిన్న అధికారికంగా ప్రకటించగా... ఈరోజు బీ ఫామ్ ఇచ్చింది.