నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవికుమార్ ఆయన సొంత గ్రామమైన త్రిపురారం మండలం పల్గుతండాలో పర్యటించారు. గ్రామంలోని వారిని ఓట్లు అడిగే సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రచార ప్రసంగంలో మాట్లాడుతూ ఏడ్చేశారు. తనకు భాజపా అవకాశం ఇచ్చిందని... అందరూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.
సాగర్ ప్రచారంలో ఏడ్చిన భాజపా అభ్యర్థి - నాగార్జున సాగర్
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి భావోద్యేగానికి గురయ్యారు. కమలం గుర్తుకు ఓటు వేసి భాజపాను గెలిపించాలని కోరారు.
సాగర్ ప్రచారంలో ఏడ్చేసిన భాజపా అభ్యర్థి
Last Updated : Apr 2, 2021, 5:40 PM IST