నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీపీమండల్ 102 జయంతిని ఘనంగా నిర్వహించారు. మిర్యాలగూడలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మిర్యాలగూడలో బీపీ మండల్ 102 జయంతి వేడుకలు - నల్గొండ జిల్లా తాజా వార్తలు
బిందేశ్వరీ ప్రసాద్ మండల్ 102వ జయంతి వేడకులు మిర్యాలగూడలో నిర్వహించారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
మిర్యాలగూడలో బీపీ మండల్ 102 జయంతి వేడుకలు
వెనుకబడిన కులాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఆయన సూచించిన 40 సిఫార్సులను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.