Road Accident At Vijayawada National Highway : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం వాహనాన్ని మంచిగా నడిపినా ఎదుటి వారు సరిగ్గా నడుపుతారో లేదో తెలీదు. అత్యంత వేగం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అతివేగం వల్ల డివైడర్ను ఢీ కొట్టడం, స్కిడ్ అవ్వడం క్షణంలో జీవితమంతా తిరగపడిపోతుంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీటు బెల్ట్ ధరించక పోవడం వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఒక్క రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని కుటుంబానికి ఎల్లకాలం దూరం చేస్తుంది. అదే పేద కుటుంబం అయితే ఆ ప్రమాదమే వారిని రోడ్డున పడేస్తుంది.
నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు రోడ్డుపై ఇసుక ఎక్కువగా ఉండడం వల్ల స్కిడ్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఎదురుగా హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు లిఫ్టు తీసుకొని ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.