రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని భాజపా మహిళ మోర్చా నాయకురాలు రుక్మిణి దేవి ఆరోపించారు. ఎస్సీలకు సబ్సిడీ రుణాలు అందించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఎస్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: రుక్మిణి దేవి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు ఎస్సీలను గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని భాజపా మహిళ మోర్చా నాయకురాలు రుక్మిణి దేవి ఆరోపించారు. ఎస్సీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎస్సీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: రుక్మిణి దేవి
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని రుక్మిణి దేవి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వకుపోగా..కేంద్రం ఇస్తోన్న సబ్సిడీ రుణాలను రైతుబందు ద్వారా చేలించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. తెరాస సర్కారు తీసుకుంటోన్న నిర్ణయాలు ఎస్సీలను మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి : 'ఓటుకు నోటు కేసు అ.ని.శా. కోర్టు పరిధిలోకి రాదు'