కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విధులు బహిష్కరించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఉద్యోగ భద్రత ఉండదని, సామాన్య ప్రజానీకం, వ్యవసాయదారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి'
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బ్యాంకర్లు విధులు బహిష్కరించారు. ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వగా మద్దతుగా నిరసన తెలియజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపు కూడా తమ నిరసనలు కొనసాగుతాయని బ్యాంకు ఉద్యోగులు స్పష్టం చేశారు
'బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి'
కరోనా సమయంలో కూడా ఉద్యోగస్తులు ధైర్యంగా ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించారని.. కేంద్రం బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సీఐటీయూ నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు.