నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసం భాజపా అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఆశావహుల అభిప్రాయాలను నేతలకు తెలపనున్నారు.
సీనియర్ నేతలు సూచించిన పేరును బండి సంజయ్ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. అభ్యర్థి ఎంపిక ఆదివారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.