ధాన్యం కొనుగోళ్లకు బాధ్యత మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ విషయంలో అధికార తెరాస(TRS), కేంద్రంలో ఉన్న భాజపా(BJP) పోటాపోటీగా నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో వరిధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) తెలిపారు. రేపు, ఎల్లుండి నల్గొండ(nalgonda), సూర్యాపేట(suryapeta) జిల్లాల రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నట్లు వెల్లడించారు.
వరిధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు భాజపా ప్రకటించింది. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్న బండి సంజయ్(BJP state president Bandi Sanjay) ... నల్గొండ రూరల్(nalgonda) మండలంలోని అర్జాలబావి ఐకేపీ సెంటర్‌ను సందర్శించనున్నట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించి రైతులను కలవనున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రేపు రాత్రి సూర్యాపేటలోనే బస చేసి... ఎల్లుండి తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పుల, జనగామ మండలాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా మార్కెట్‌లో ధాన్యం అమ్మకంపై ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించనున్నట్లు బండి సంజయ్(BJP state president Bandi Sanjay) వివరించారు.
బండి సంజయ్ రాక సందర్భంగా కమలం శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ప్లెక్సీలను ఏర్పాటు చేసే పనిలో కమలం శ్రేణులు నిమగ్నమయ్యాయి.
పోటాపోటీగా ఆందోళనలు