తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay Tour: రణరంగంగా బండి సంజయ్​ పర్యటన.. అడుగడుగునా దాడులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌(bandi sanjay latest news) చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన కార్యక్రమం(bandi sanjay nalgonda tour)... తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. తెరాస శ్రేణులు(trs vs bjp) అడుగడునా బండిని అడ్డుకున్నారు. రాళ్లు, కోడి గుడ్లతో దాడులు... రణరంగాన్ని తలపించాయి. భాజపా కార్యకర్తలపై దాడిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని బండి సంజయ్‌... కేంద్రాన్ని సమాచారం ఇచ్చామన్నారు. మిర్యాలగూడ, నేరేడుచర్లలో తమపై దాడులు జరుగుతుంటే పోలీసులే ప్రోత్సహిస్తూ... ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు.

bandi sanjay nalgonda tour turned over into battlefield
bandi sanjay nalgonda tour turned over into battlefield

By

Published : Nov 16, 2021, 4:35 AM IST

రణరంగంగా బండి సంజయ్​ పర్యటన.. అడుగడుగునా దాడులు

ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం బండి సంజయ్ చేపట్టిన యాత్ర(bandi sanjay nalgonda tour) రణరంగంగా మారింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ(trs vs bjp) ఏర్పడింది. మిర్యాలగూడ రాళ్ల దాడిలో పలువురికి గాయాలు కాగా... నేరేడుచర్లలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సంజయ్ రాక(bandi sanjay latest news) పట్ల నిరసన తెలియజేస్తామని ముందుగానే ప్రకటించిన తెరాస శ్రేణులు(trs vs bjp) అడుగడుగునా ఆయన్ను అడ్డుకున్నాయి. పరస్పర నినాదాలు, కోడిగుడ్లు, రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి విధ్వంసకరంగా మారింది. మిర్యాలగూడ, శెట్టిపాలెం, చిల్లేపల్లి వంతెన, నేరేడుచర్ల, గరిడేపల్లి, గడ్డిపల్లి ఇలా ప్రతి చోటా భారీగా తెరాస శ్రేణులు.. బండి కాన్వాయ్‌ను అడ్డుకుంటూ ఆందోళనలు చేశారు.

రాత్రి వరకు నిరసనలు ఆగలేదు..

సోమవారం రాత్రి బండి సంజయ్‌ సూర్యాపేట చేరుకునే వరకూ నిరసనలు ఆగలేదు. పెన్ పహాడ్ మండలం అనంతారం, అనాజ్ పూర్ మీదుగా సూర్యాపేట వెళ్తుండగా... అడుగడుగునా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. జానారెడ్డినగర్‌లో భోజనానికి ఆగిన బండి సంజయ్‌.... తెరాస తీరును తీవ్రంగా విమర్శించారు. తన పర్యటనలో జరిగిన దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు పర్యటన కొనసాగుతుందన్న ఆయన.... రెండ్రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలపై జనగామలో రేపు భాజపా పదాధికారుల అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పర్యటన కొనసాగుతుంది..

"ముఖ్యమంత్రికి భాజపా అంటే భయం పట్టుకుంది. రాష్ట్రంలో అవినీతిని బయటపెట్టి ఆయన కుటుంబాన్ని జైల్లో పెడతాం. రైతుల దృష్టి మళ్లించడానికి... భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భాజపా కాదు. దానికి భయపడే కార్యకర్తలు భాజపా కార్యకర్తలు కాదు. రాష్ట్రముఖ్యమంత్రి బయటకు రావాలి. ఏమన్నా అంటే కేంద్రం అంటారు. ఎఫ్​సీఐ, రాష్ట్రానికి జరిగిన ఒప్పందం ఏంటి? 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలి. మీరు కొన్నది ఎంత? 7 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు ప్రభుత్వమే చెప్తోంది. రైతుల కోసం రాళ్ల దాడికైనా సిద్ధమే. తెరాస దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మా పర్యటన సమాచారం ముందే ఉన్నా....వందల పోలీసుల గస్తీ ఉన్నా దాడులను ఆపలేకపోయారు. కొన్ని చోట్ల పోలీసులే దాడులకు ప్రోత్సహించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు గాడి తప్పాయి. పర్యటనలో జరిగిన దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేశాం. రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటన కొనసాగుతుంది." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

నిరసనలు, ఘర్షణలు, దాడులు, బాహాబాహీల మధ్య తొలిరోజు సందర్శించిన బండి సంజయ్‌.... ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో తన పర్యటన కొనసాగించనున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details