నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేళ తిరుమలగిరి మండలం రంగుండ్లలో గిరిజన భాజపా నాయకుడు పాండు నాయక్ ఇంట్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా భాజపా అభ్యర్థి రవి నాయక్, తదితరులు హాజరయ్యారు.
గిరిజన నాయకుని ఇంట బండి సంజయ్ భోజనం - bandi Sanjay latest news
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక వేళ చివరి రోజు ప్రచారానికి నేతలు సిద్ధమయ్యారు. పలువురు నేతలు అక్కడే మకాం వేశారు. ఈ నేపథ్యంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓ భాజపా నాయకుని ఇంట్లో భోజనం చేసి రాత్రి అక్కడే బస చేశారు.
గిరిజన నాయకుని ఇంట బండి సంజయ్ భోజనం
భోజనం అనంతరం సంజయ్ అక్కడే వారి ఇంట్లోనే రాత్రి బస చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్న నేపథ్యంలో బండి సంజయ్, అభ్యర్థి రవి కుమార్, తదితరులు అక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇదీ చూడండి:'ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో బేరీజు వేసుకోవాలి'