తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటుకు రూ.40 వేలు తీసుకుని భాజపాకు ఓటు వేయండి: బండి సంజయ్‌ - munugode by poll

Bandi Sanjay fires on KCR: సీఎం కేసీఆర్‌ది దండుపాళ్యం ముఠా అని.. ఒక్క రాజగోపాల్​రెడ్డిని ఓడించేందుకు ఆ బ్యాచ్‌ అంతా మునుగోడుకు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. తెరాస నుంచి ఓటుకు రూ.40 వేలు తక్కువ కాకుండా తీసుకొని భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Bandi Sanjay
Bandi Sanjay

By

Published : Oct 18, 2022, 4:50 PM IST

రాష్ట్రంలో రాక్షసులకు, రామదండుకు యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్‌

Bandi Sanjay fires on KCR: మునుగోడులో రాజకీయవేడి ఊపందుకుంది. తాజాగా మునుగోడులోని మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యుద్దం ప్రారంభమైందని వ్యాఖ్యానించిన ఆయన.. సీఎం కేసీఆర్‌ది దండుపాళ్యం ముఠా అని విమర్శించారు. ఒక్క రాజగోపాల్‌ రెడ్డిని ఓడించేందుకు ఈ బ్యాచ్‌ అంత మునుగోడుకు వచ్చిందని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం రూ.లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఉప ఎన్నికలో కేసీఆర్ దొంగనోట్లు పంచుతున్నారని.. జాగ్రత్తగా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఓటుకు రూ.40 వేలకు తక్కువ ఇచ్చినా తీసుకోవద్దని.. ఆ డబ్బులు తీసుకొని తెరాసకు ఓటు వేయకుండా భాజపాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండలం వచ్చిందని తెలిపిన ఆయన.. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశారని కొనియాడారు.

కోర్టులో పిటిషన్ వేసి కేసీఆర్‌ ఎన్నికలు ఆపాలని చూస్తున్నారని బండిసంజయ్‌ మండిపడ్డారు. మునుగోడులో గొడవలు సృష్టించాలని తెరాస నేతలు చూస్తున్నారని ఆరోపించారు. లిక్కర్‌, భూ కుంభకోణంలో కవిత పేరు ఉందని విమర్శించిన ఆయన.. కేసీఆర్ ఎంతమందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చారని ప్రశ్నించారు. మీ ఓటుతో కేసీఆర్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్‌ అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details