నల్గొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు... బ్యాలెట్లో వరుస సంఖ్యలు కేటాయించారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులను తొలుత... తెలుగు వర్ణమాలను అనుసరించి స్వతంత్ర అభ్యర్థులకు ఆ తర్వాత సంఖ్యలను కేటాయించారు.
పట్టభద్రుల ఎన్నికల బ్యాలెట్లో వరుస సంఖ్యలు కేటాయింపు - తెలంగాణ తాజా వార్తలు
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానంలో బరిలో నిలిచిన అభ్యర్థులకు వరుస సంఖ్యలను కేటాయించారు. ఒకటో నంబరులో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి... రెండో సంఖ్యలో సీపీఐ జయసారథిరెడ్డి... మూడులో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి... నాలుగో నంబరుపై కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ పేర్లు ఉన్నాయి.
ఒకటో నంబరులో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి... రెండో సంఖ్యలో సీపీఐ జయసారథిరెడ్డి... మూడులో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి... నాలుగో నంబరుపై కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ పేర్లు ఉన్నాయి. ఇక ఏడో నంబరులో తెజస అభ్యర్థి కోదండరాం... పదిలో యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాణీ రుద్రమ... 11 నంబరులో తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ పేర్లు ఉన్నాయి. 17 నుంచి 71 క్రమ సంఖ్యలను... స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించారు.
ఇవీచూడండి:గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఫోన్చేయనున్న సీఎం కేసీఆర్!