తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొత్త రైల్వేలైను మంజూరు చేయండి' - MP

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ కేంద్రాన్ని కోరారు. నడికూడి-బీబీ నగర్ మధ్య కొత్త లైను నిర్మిస్తే హైదరాబాద్-అమరావతి మధ్య ప్రయాణం మరింత సులభతరమవుతుందన్నారు.

బడుగుల లింగయ్య యాదవ్

By

Published : Feb 4, 2019, 7:46 PM IST

సూర్యాపేట జిల్లా చిట్యాల నుంచి జగ్గయ్యపేట మార్గంలో కొత్త రైలు మార్గం వేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. నడికూడి- బీబీనగర్ రైలు మార్గంలో నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, జగ్గయ్యపేట మీదుగా కొత్త మార్గం నిర్మిస్తే... ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని లింగయ్య వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు వివరించారు.

బడుగుల లింగయ్య యాదవ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details