నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. అభ్యర్థులు మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థుల తరఫున ఆయా పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి దిగారు.
సాగర్ హిల్ కాలనీలో బాబుమోహన్ రోడ్ షో - babu mohan road show in hill colony nagarjuna sagar
నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలు తమ అగ్రశ్రేణి నాయకులను అభ్యర్థుల తరఫున ప్రచారంలోకి దించాయి. భాజపా అభ్యర్థి రవికుమార్ నాయక్ తరఫున మాజీ మంత్రి బాబు మోహన్ రోడ్ షో చేపట్టారు.

బాబు మోహన్ రోడ్ షో, నాగార్జున సాగర్ ఉపఎన్నికలు
ఈ నేపథ్యంలో భాజపా నాయకత్వం అగ్ర నాయకులను రంగంలోకి దించింది. అభ్యర్థి రవికుమార్ నాయక్ తరఫున సాగర్ హిల్ కాలనీలో మాజీ మంత్రి, సినీనటుడు బాబు మోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హిల్ కాలనీలో 5 వార్డుల్లో రోడ్ షో చేశారు. రవికుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి:టీడీఆర్ ఒక మంచి ప్రయత్నం.. కేటీఆర్ ట్వీట్