తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన సదస్సు

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని చిన్న మసీదు వద్ద తెలంగాణ ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

Awareness seminar for Muslim minorities on graduate vote registration
పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన సదస్సు

By

Published : Nov 2, 2020, 5:21 PM IST

నల్గొండ జిల్లా.. మిర్యాలగూడలోని చిన్న మసీదు వద్ద ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదుపై ముస్లిం మైనార్టీలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆల్ మైనారిటీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గత కొన్ని రోజులగా వాట్సప్ సందేశాల ద్వారా, పత్రికల ద్వారా పట్టభద్రుల ఓటు నమోదును ప్రచారంలోకి తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాదులో ఇటీవల వచ్చిన భారీ వరదలతో చాలామంది పట్టభద్రులు ధ్రువపత్రాలు పోగొట్టుకున్నందున.. ఓటు నమోదుకు చివరి తేదీని 6 నుంచి ఈ నెల 15 వరకు పొడిగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఇప్పటి వరకూ గద్వాల జిల్లా నారాయణపేట్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాచలం జిల్లాలలో మైనార్టీల ఓటరు నమోదు అవగాహన సదస్సులు నిర్వహించినట్లు వివరించారు.

ఇవీ చదవండి: పరిహారంలో నిర్లక్ష్యం.. రహదారి విస్తరణ పనుల్లో జాప్యం

ABOUT THE AUTHOR

...view details