నల్గొండ జిల్లా రూరల్ పోలీసులు కరోనా వైరస్‌పై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి యముడు, చిత్రగుప్తుడు వేషాధారణలో నిబంధనలు గుర్తుచేస్తున్నారు.
కరోనాపై యముడు, చిత్రగుప్తుడి వేషంలో అవగాహన - కరోనాపై యముడు, చిత్రగుప్తుడి అవగాహన
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. నల్గొండలో యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో అవగాహన కల్పించారు.
కరోనాపై యముడు, చిత్రగుప్తుడి అవగాహన
జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చిన సడలింపులకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ