రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. భూసేకరణలో ఉన్నటువంటి కపూర్ తండా,మోదుగు కుంట తండాలోని గ్రామస్థులను పోలీసుల సహకారంతో పవర్‌ప్లాంట్ అధికారులు ఖాళీ చేయించారు. గతంలో దీని నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ జరిపినప్పుడు అక్కడి ప్రజలను వేరేచోట తరలించేందుకు అని ఏర్పాట్లు చేసి... 2020 జూన్‌లోనే వారికి పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
ఇళ్లను అద్దెకిస్తున్నారు...
అప్పుడే 15 రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పగా... వారు సమయం కోరినట్లు చెప్పారు. ఇప్పటికే సంవత్సర కాలం గడిచినప్పటికీ కొంతమంది ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో పవర్ ప్లాంట్ అధికారులు, పోలీసుల సహాయంతో వారి ఇళ్లను ఖాళీ చేయించారు. గ్రామస్థులు కొంతమంది వేరే ప్రాంతాల్లో వుంటూ... పవర్ ప్లాంట్‌లో పనిచేసే వారికి తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారని అధికారులు ఆరోపించారు.