సీఎం కేసీఆర్.. అన్ని వర్గాలకు న్యాయం చేయడంలో ముందుంటారని తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొనియాడారు. గతంలో ఎలాంటి అభివృద్ధి చేయని వారిని ఎన్నికల్లో గెలిపించినా.. లాభముండదంటూ విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి.. అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. మాడుగులపల్లి మండలం కన్నెకల్‌లో.. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేల ప్రచారం - ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
సాగర్ ఉప ఎన్నిక దగ్గర పడుతోన్న వేళ.. ప్రచార జోరు ఊపందుకుంది. మాడుగుల పల్లి మండలంలో.. ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
![ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యేల ప్రచారం Sagar by-elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11296389-278-11296389-1617686252160.jpg)
సాగర్ ఉప ఎన్నిక
తెరాస ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలే.. అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిస్తాయని ఫైళ్ల శేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో పార్టీ కార్యకర్తలు.. పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చదవండి:24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా కేసులు