తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలకు అంతా సిద్ధం... పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

రేపు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలోని పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ గణేశ్ పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

arrangements-for-mlc-elections-at-miryalaguda-in-nalgonda
ఎన్నికలకు అంతా సిద్ధం... పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

By

Published : Mar 13, 2021, 7:48 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరగనున్న ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను మిర్యాలగూడ తహసీల్దార్ గణేశ్ పరిశీలించారు. మండల కేంద్రంలో 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా... 13,577 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారని తహసీల్దార్ గణేశ్ తెలిపారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్​కాస్టింగ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియను చిత్రీకరించనున్నామని అన్నారు. 90 మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు పూర్తైన ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details