తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు - నల్గొండ జిల్లా వార్తలు

nalgonda-district
nalgonda-district

By

Published : Feb 9, 2021, 7:25 PM IST

Updated : Feb 9, 2021, 7:59 PM IST

19:24 February 09

నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు

నల్గొండ జిల్లాకు మరో ఐదు ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ.585 కోట్ల వ్యయంతో పొగిళ్ల, కంబాలపల్లి, అంబాభవాని, పెద్దగట్టు, ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయి. రూ.202 కోట్ల వ్యయంతో కంబాలపల్లి ఎత్తిపోతలను, రూ.184 కోట్ల వైజాగ్ కాలనీ సమీపంలో అంబాభవాని ఎత్తిపోతలను చేపట్టనున్నారు. అంగడిపేట సమీపంలో రూ.90కోట్ల వ్యయంతో ఏకేబీఆర్ ఎత్తిపోతల పథకాన్ని, రూ.82 కోట్లతో పెద్దగట్టు ఎత్తిపోతలను నిర్మించనున్నారు.  

రూ.24కోట్ల వ్యయంతో పొగిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టనున్నారు. ఆర్ - 9 ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఎత్తైన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ప్రెజర్ మెయిన్ల నిర్మాణాన్ని ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఇదీ చదవండి :రేపు సాగర్​కు కేసీఆర్... ఉప ఎన్నికలపై దిశా నిర్దేశం!

Last Updated : Feb 9, 2021, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details