నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని తన ఇంట్లో అమృతస్పృహతప్పి పడిపోయారు. బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ సమయంలో అమృత కిందపడిపోయారు.
స్పృహతప్పి పడిపోయిన అమృత - Amrita latest
ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు కూతురు, హత్య గురైన ప్రణయ్ భార్య అమృత మీడియాతో మాట్లాడుతు స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
స్పృహతప్పి పడిపోయిన అమృత
అంతకు ముందు మారుతీరావు అంత్యక్రియలకు వెళ్లిన అమ్మతను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. మారుతీరావు తన తమ్ముడు శ్రవణ్ ఒత్తిడి, బెదిరింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అమృత ఆరోపించారు. తన చిన్నప్పటి నుంచి మారుతీరావును శ్రవణ్ బెదిరించడం చాలాసార్లు చూశానని చెప్పింది అమృత. మిర్యాలగూడలో ఎవరినైనా ఎదిరించగల మారుతీరావు.. తన తమ్ముడు శ్రవణ్‌కు మాత్రం అడ్డు చెప్పేవాడు కాదని తెలిపింది.
ఇదీ చూడండి:సినిమాలో విలన్లు ఐఫోన్ అందుకే వాడరట