తెలంగాణ

telangana

ETV Bharat / state

35 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు..

నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ అండ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. దాదాపు 35 ఏళ్ల తరువాత 113 మంది పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు.

నల్గొండలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నల్గొండలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By

Published : Dec 31, 2022, 9:52 PM IST

వారందరూ 1987లో పదో తరగతి పూర్తి చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం యాభై సంవత్సరాల వయస్సు దాటినవారు. వీరంతా నల్గొండలోని సెయింట్ ఆల్ఫోన్సస్ అండ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌కు చెందిన మొత్తం 113 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 35 ఏళ్ల తరువాత అందరూ ఒక్కచోట కలుసుకున్నారు. సుధీర్ఘ కాలం తర్వాత కలుసుకోవటంతో భావోద్వేగాలకు లోనయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.

రెండు రోజుల పాటు హైదరాబాద్​లోని ఫామ్​హౌజ్‌లో రకరకాల ఆటలు ఆడుతూ.. చిన్న పిల్లల్లా డాన్స్‌లు చేస్తూ సందడిగా గడిపారు. ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ సంతోషించారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా దేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లు కూడా 50 సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్నారు. వీరిలో 34 మంది మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన తోటి మిత్రులకు సంతాపం తెలియజేశారు. మూడేళ్ల క్రితం నుంచే ఈ కార్యక్రమానికి సన్నాహాలు చేసుకున్నట్లు తెలిపారు.

నల్గొండలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details