నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నిడమనూరు రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తెలిపారు.
సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి! - తెలంగాణ వార్తలు
నాగార్జున సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నిడమనూరు రిటర్నింగ్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
సాగర్ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి!
ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉందని వెల్లడించారు. వచ్చే నెల 17న పోలింగ్ జరగనుందని పేర్కొన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వివరించారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:అసెంబ్లీ ముట్టడికి గంగపుత్ర సంఘం యత్నం.. స్వల్ప ఉద్రిక్తత!