తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపాను ఎదుర్కోలేకే ఇతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి' - latest news on bjp laxman

పురపాలక ఎన్నికల సన్నాహకంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ పర్యటించారు. ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు కొన్ని పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన విమర్శించారు.

All non-party parties come together to face Bhajapa
'భాజపాను ఎదుర్కోలేకే పార్టీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి'

By

Published : Dec 29, 2019, 2:56 PM IST

పురపాలిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లు రాబట్టుకునేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ... తమ పార్టీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీకి తెరాసనే తొత్తుగా మారిందని ఘాటైన విమర్శలు చేశారు.

పురపాలిక ఎన్నికల సన్నాహకంలో భాగంగా నల్గొండలో పర్యటించిన లక్ష్మణ్... జిల్లా నాయకులతో భేటీ అయ్యారు. ఎదుగుతున్న భాజపాను ఎదుర్కోలేకే.. తెరాస, కాంగ్రెస్​, వామపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయని ఆయన విమర్శించారు.

'భాజపాను ఎదుర్కోలేకే పార్టీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details