నల్గొండ జిల్లా నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో బుధవారం కురిసిన అకాల వర్షానికి 200 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసింది. దీనివల్ల రైతులు ఆందోళనకు గురయ్యారు. అధికారులు కొనుగోళ్లను వెంట, వెంటనే పూర్తి చేయాలని కోరారు. ధాన్యంపై కప్పటానికి తగిన పరదాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యం