తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దల పెళ్లికి నై... ప్రేమ పెళ్లికి సై - నల్గొండ జిల్లా కనగల్​ తాజా వార్తలు

నల్గొండ జిల్లా కనగల్ మండలంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ యువతి... మరుసటి రోజు తన మనసుకు నచ్చిన యువకుడినే మనువాడింది.

a-women-got-another-marriage-within-24-hours-in-nalgonda-district
పెద్దల పెళ్లికి నై... ప్రేమ పెళ్లికి సై

By

Published : Jun 14, 2020, 1:48 PM IST

Updated : Jun 14, 2020, 11:07 PM IST

నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన మౌనిక... కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెద్దలకు ప్రేమ విషయం చెప్పలేక... తల్లిదండ్రులు చూసిన హైదరాబాద్​కు చెందిన వరుడితో శుక్రవారం పెళ్లి జరిగింది.

అతని రాకతో కొండంత ధైర్యం..

ఈ నేపథ్యంలో తన సమీప బంధువు.. వరుసకు మామయ్య.. దేవరకొండకు చెందిన రాజేష్ అనే యువకుడు, మౌనిక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహం అయిన కాసేపటికి రాజేష్ అక్కడికి వచ్చాడు. మనిసిచ్చినోడు రాగానే మౌనికకు కొండంత ధైర్యం వచ్చింది. రాజేశ్​ను పట్టుకుని గట్టిగా ఏడుస్తూ బాధపడింది.

ఈ క్రమంలో మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంచాయితీ పెట్టాడు. ఇంతలో పోలీసులూ రంగంలోకి దిగారు. చర్చల అనంతరం తాము పెళ్లిని రద్దు చేసుకుంటున్నామని మగ పెళ్లివారు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ప్రియుడిని వివాహమాడే అవకాశం లభించిన మౌనిక.. ఆనందంతో శనివారం మనిసిచ్చినోడినే మనువాడింది.

పెద్దల పెళ్లికి నై... ప్రేమ పెళ్లికి సై

ఇదీచూడండి: ప్రేమ వివాహం.. యువకుడిపై యువతి బంధువుల దాడి

Last Updated : Jun 14, 2020, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details