Tribal Family at Pragathi Bhavan: కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ.... ఓ గిరిజన కుటుంబం ప్రగతిభవన్‌కు వెళ్లింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు శివరామ్ గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు.
"గతేడాది మా కుమారుడు చనిపోయాడు. ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మేమేం కొట్లాడటానికి ప్రగతిభవన్‌కు రాలేదు. న్యాయం కోసమే సీఎం కేసీఆర్‌ను కలవడానికి వచ్చాం. దయచేసి ఇప్పటికైనా పోలీసులు మా గోడు వినిపించుకోవాలి." -బాధిత కుటుంబం