తెలంగాణ

telangana

ETV Bharat / state

చట్ట సభల్లో గళమెత్తుతా.. బలమివ్వండి..! - Spiritual association with minority graduates

నల్గొండ పట్టణంలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.

A spiritual amalgamation program was organized with the graduates in Nalgonda town
చట్ట సభల్లో గళమెత్తుతా.. బలమివ్వండి..!

By

Published : Mar 6, 2021, 12:00 PM IST

నల్గొండ పట్టణంలోని బహదూర్ ఖాన్ భవనంలో శుక్రవారం సాయంత్రం ముస్లిం మైనారిటీ పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు.

ఈ భేటీలో.. ప్రజల పక్షాన చట్టసభల్లో గొంతు వినిపించడం కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు కోదండరాం తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెరాస ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు ఎలాంటి ప్రయోజనం కలిగే పనులు చేయలేకపోయిందని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తనను చట్ట సభలకు పంపిస్తే... ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:'ఆచార్య' గురించి లీక్​ చేసిన పూజాహెగ్డే

ABOUT THE AUTHOR

...view details